Sunday, December 22, 2024

స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్ : స్కూల్ బస్సు కింద పడి ఆరేళ్ల చిన్నారి అనుశ్రీ మృతి చెందిన ఘటన మెదక్ మున్సిపాలిటీలోని నాలగవ వార్డు తారక రామనగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం తారక రామనగర్ కాలనీకి చెందిన బిక్షపతి నవీనల కుమార్తె అనుశ్రీ(6) మెదక్ పట్టణంలోని మాస్టర్ మైండ్ స్కూల్‌లో ఒకటవ తరగతి చదువుతుంది. ఉదయం బడికి స్కూల్ బస్సులో వెళ్లి సాయంత్రం ప్రతిరోజు మాదిరిగానే బస్సులో వచ్చింది. బస్సు దిగి ఇంటికి వెళ్తున్న అనుశ్రీ బస్సు కింద పడిపోగా ఆ విషయం

గమనించని డ్రైవర్ చిన్నారి తలపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. తమ బిడ్డ ఇంటికి రాకపోవడంతో బయటకు వచ్చి చూసేసరికి బస్సు కింద బిడ్డను చూసి ఒక్కసారిగా కుటుంబీకులు బోరున విలపించారు. డ్రైవర్ నిర్లక్షంతో అనుశ్రీ మరణించిందని తల్లితండ్రులు ఆరోపించారు. అనుశ్రీ పిన్ని బాబాయ్ అయిన నందిని రవికి పిల్లలు కాకపోవడంతో తమ అక్క కూతురైన అనుశ్రీని పెంచుకుంటున్నా రు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే పాప మృతి చెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News