Sunday, February 23, 2025

కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యస్నానం: యుపి ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగంలో 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం శనివారం వెల్లడించింది. మహాకుంభమేళా జనవరి 13 మొదలయింది. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ముగియనున్నది. ఇండియాలోని 110 కోట్ల సనాతన ధర్మం ఆచరించే వారిలో సగం మంది ఇప్పటికే గంగా,యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు. ప్రపంచ జనాభాను సమీక్షించే ప్యూ రీసెర్చ్ ప్రకారం భారత దేశ జనాభా 143 కోట్లు(1.43 బిలియన్). వారిలో 110 కోట్ల (1.10 బిలియన్) మంది సనాతన ధర్మాన్ని ఆచరించే జనం ఉన్నారు.

అంటే మహాకుంభమేళాలో ఈపాటికే 55 శాతం మంది సనాతనులు నదీ పుణ్య స్నానం ఆచరించారు. సీతా దేవి(జానకి అమ్మవారు) జన్మస్థలం అయిన నేపాల్ నుంచి 50 లక్షల మంది కంటే ఎక్కువ మంది పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 18 నాటికే 55 కోట్ల మంది భారతీయులు సంగంలో స్నానం ఆచరించారు. రానున్న మహాశివరాత్రి స్నానానికి ఈ సంఖ్య 65 కోట్లు(650 మిలియన్) దాటుతుందని యుపి ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే మౌని అమావాస్య, మకర సంక్రాంతి, బసంత్ పంచమి సందర్భంగా కోట్లాది మంది పుణ్యస్నానం ఆచరించారన్నది గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News