Sunday, December 22, 2024

సిరియాలో మిలిటరీ కాలేజీపై డ్రోన్ల దాడి…

- Advertisement -
- Advertisement -

డమాస్కస్ : సిరియాలో మిలిటరీ కాలేజీపై తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడి చేయడంతో ఏడుగురు ఆర్మీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు సిరియన్ స్టేట్ టీవీ తెలియజేసింది. సహాయక బృందాలు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్చారు. హోమ్స్ ప్రావిన్స్ లోని మిలిటరీ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న సైనిక అధికారులకు గ్రాడ్యేయేషన్ డేను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిరియా రక్షణ మంత్రి సహా , ఆర్మీ కమాండర్‌లు హాజరయ్యారు. వారిని లక్షంగా చేసుకుని తిరుగుబాటుదారులు డ్రోన్లతో దాడికి పాల్పడ్డారని సిరియా సైన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది. అంతకు ముందు సిరియా సైన్యం తిరుగుబాటుదారులు ఉంటున్న ఓ గ్రామంపై దాడి చేసింది. ఈ ఘటనలో ఐదుగురు గ్రామస్థులు సహా పలువురు అత్యవసర సిబ్బంది మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News