Monday, December 23, 2024

దేశ విత్తన అవసరాల్లో 60% తెలంగాణ నుంచే

- Advertisement -
- Advertisement -

60% of country's seed requirements are from Telangana

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కొటేశ్వరరావు

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో వ్యవసాయ రంగానికి అవసరమైన విత్తనాల్లో 60శాతం విత్తనాలను తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు వెల్లడించారు. వ్యవసాయ, విత్తన రంగాల అభివృద్దిపై అద్యయనం చేయడానికి కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రిత్వ బృందం రాష్ట్ర పర్యటనకు ఇక్కడికి వచ్చింది. ఈ సందర్బంగా శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఇస్టాలో విత్తనపరీక్షాకేంద్రంలో చైర్మన్ కొండబాల అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ వ్యవసాయ, విత్తన రంగ అభివృద్ధి, ప్రభుత్వం చేపడుతున్న పథకాలు సంస్కరణల గురించి సమావేశంలో సంస్థ ఎండి డా.కేశవులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.నానాటికీ నాణ్యమైన విత్తనంపై రైతుకు పెరుగుతున్న అవగాహణ వల్ల, రైతు స్వతహాగా విత్తనాన్ని తయారు చేసుకునే విధానానికి స్వస్తి చెప్పి, బయట మార్కెట్ లో దొరికే విత్తనంపై రైతు ఆధారపడుతున్నారని తెలిపారు.

అందుకే ప్రపంచంలో, దేశంలో విత్తన మార్కెట్ విలువ పెరుగుతూ వస్తుందని వివరించారు.తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ, విత్తన దృవీకరణ సంస్థ ఉత్పత్తి చేసి, దృవీకరించిన విత్తనాలు దాదాపు 10 నుండి 12 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు.వ్యవసాయ ఆధారిత భారత దేశంలో రైతుకు సాగు నీటి లభ్యత తరువాత అత్యంత ముఖ్యమైనది నాణ్యమైన విత్తనం అని, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంస్కరణల ద్వారా వ్యవసాయ విప్లవం తీసుకొచ్చారని ఎండి కేశవులు వివరించారు. చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ విత్తన రంగ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహిస్తుందన్నారు. తెలంగాణలో 400 విత్తన కంపెనీలు ఉన్నాయని , భారత దేశానికి కావలిసిన 60శాతం విత్తనాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని వెల్లడించారు.

త్వరలో హైదరబాద్ లో అన్ని రాష్ట్రాల సీడ్స్ కార్పొరేషన్ల తో జాతీయ స్థాయి సదస్సు ను నిర్వహిస్తామని, ఈ సదస్సుకు ఆహ్వానం ఇస్తామని కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రికి తెలిపారు. వ్యవసాయ, విత్తన రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు కర్ణాటకలో కూడా అమలు చేస్తామని ఈ సందర్బంగా – కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బి.సి పాటిల్ ప్రకటించారు.రైతుకు నాణ్యమైన విత్తనం అందించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ప్రశంసించారు.రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టడం అంటే రైతును హత్య చేయడమే -అని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం అలాంటి నకీలి విత్తనదారులపై పిడి యాక్ట్ ప్రయోగించడం ఎంతో ఆదర్శనీయం -అన్నారు.

దేశంలో ప్రైవేట్ విత్తన రంగానికి దీటుగా, ప్రభుత్వ విత్తన రంగం కూడా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందన్నారు, అప్పుడే ప్రభుత్వాల నియంత్రణలో రైతుకు నాణ్యమైన విత్తనాలను అందించడానికి వీలు పడుతుందన్నారు. విత్తన ఎగుమతులను ప్రోత్సహించడానికి, తెలంగాణలో లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇష్టా అంతర్జాతీయ విత్తన పరీక్ష ల్యాబ్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం లాగే , కర్నాటకలో కూడా ఏర్పాటు చేయాడానికి ప్రణాళికలు రూపొందించాలని కర్నాటక అధికారులను మంత్రి పాటిల్ ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News