Monday, December 23, 2024

కుష్టురోగుల్లో 60 శాతం భారత్‌లోనే!

- Advertisement -
- Advertisement -

60% of lepers are in India!

 

న్యూఢిల్లీ: 2005లో భారత్‌ను కుష్టువ్యాధి రహిత దేశంగా ప్రకటించినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఆ వ్యాధి బారినపడిన వారిలో సగం మందికిపైగా (60 శాతం) భారత్‌లోనే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కొత్త కేసుల్లో 76 శాతం బీహార్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌లోనే ఉన్నట్టు జాతీయ కుష్టువ్యాధి నివారణ ప్రోగ్రాం (ఎన్‌ఎల్‌ఇపి) గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఓ) ప్రకారం 2019-20లో దేశంలో 1,14,451 కొత్త కేసులను గుర్తించారు. ఆగ్నేయాసియా దేశాలలో నమోదైన కేసుల్లో ఇవి 80 శాతం కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, గతంలో పోలిస్తే కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తున్నట్టు ఎన్‌ఎల్‌పి పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News