- Advertisement -
న్యూఢిల్లీ: దేశ ప్రజల సహకారం, హెల్త్‌కేర్ వర్కర్ల నిస్వార్థ సేవతో దేశంలో ఇప్పటివరకు అర్హులైన 60 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ గురువారం ప్రకటించారు. ఇది కాకుండా వయోజనుల్లో 89 శాతం మందికి మొదటి డోసు ఇవ్వడం పూర్తయిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత 24 గంటల్లో 70,17,671 డోసులు పంపిణీ అయ్యాయని, దీంతో దేశం మొత్తం మీద ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 139.70 కోట్లు దాటిందని తెలిపాయి.
60% People Get Covid 2nd Dose Vaccine: Union Health Ministry
- Advertisement -