లోక్‌సభలో ప్రభుత్వం వెల్లడి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు చేపట్టిన సెంట్రల్ విస్టా అవెన్యూ పునర్ అభివృద్ధి పనులు దాదాపు 60 శాతం పూర్తయ్యాయని ప్రభుత్వం గురువారం లోక్‌సభలో వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఈ పనులు పూర్తి కావాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తయ్యాయ కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. సెంట్రల్ విస్టా అవెన్యూ రిడెవలప్‌మెంట్ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే రాజ్‌పథ్‌లోనే వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ పెరేడ్(జనవరి 26న) నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగమైన నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ప్రాజెక్టును 2022 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యమని, ఇప్పటి వరకు 35 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని మంత్రి చెప్పారు.