Friday, December 20, 2024

సిఎం రిలీఫ్ పండ్‌ కోసం పెండింగ్‌లో 60వేల దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వివిధ రకాల ఆనారోగ్యసమస్యలకు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్)కింద ప్రభుత్వ ఆర్దిక సహాయం కొరుతూ ప్రజల నుంచి వచ్చిన 60వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం శాసనసభ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటి రెడ్డి వెంటకరెడ్డి మాట్లాడుతూ సిఎం రిలీఫ్ ఫండ్‌కోసం వచ్చిన 60వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటన్నింటిని పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యదర్శిని నియమించిందని, త్వరలోనే అన్నింటినీ క్లియర్ చేయనున్నట్టు ప్రకటించారు.అంతకు ముందు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి తన నియోజకవర్గానికి చెందిన 1200 సిఎంఆర్‌ఫైల్స్ క్లియర్ చేయాలని కోరారు. జీరో అవర్‌లో సభ్యులు వివిధ రకాల సమస్యలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి ప్రభుత్వం తరుపున బలిచ్చారు.

గొర్రెల పంపిణీ పథకం కోసం ఎంతో మంది డిడిలు కట్టారన్నారు. ఈ పథకంలో కుంభకోణాలు జరిగాయన్నారు. సరిహద్దుల్లోనే గొర్రెల రీసైక్లింగ్ జరిగాయన్నారు. ఒక ద్విచక్రవాహనంలో 126గొర్రెలను తరిలించారని వచ్చిన కథనాలకు సంబంధించి ఆ వాహనం ఎంటో , ఆ తరలింపు ఎలా సాధ్యపడిందో వాటన్నింటిపైన విచారణకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏపిలో తిరుమల దర్శనం కోసం ఎమ్మెల్యే లేఖలు రోజుకు రెండు మూడు ఇచ్చే ఏర్పాటుపై చేయిస్తామన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాజశేఖర్ రెడ్డి హాస్టల్స్‌లో వసతులు కల్పించాలని కోరారు. వందపడకల వైద్యశాలలో తగినంత మంది సిబ్బందిని నియమించాలన్నారు. తెలంగాణకు కొత్తగా వస్తున్న పరిశ్రమలన్నీ హైదరాబాద్ పరిసరాలకే పరిమితమవుతున్నాయని, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిశ్రమలు రాక ఉద్యోగ ఉపాధి లేక యువత పెడదారి పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ విషయంలో తగిన గౌరవం కల్పించాలని కోరారు.

దీనిపై మంత్రి కోమటి రెడ్డి బదులిస్తూ సిఎం ఇటీవలే 2000మంది టీచర్ల నియామకాలకు అనుమతి ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రభుత్వ హాస్టళ్లను ఆధునీకరిస్తామని తెలిపారు. చేవెళ్లె ఎమ్మెల్యే కాలే యాదయ్య తన నియోజకవర్గంలో 111జివోను రద్దు చేసి 69జివో ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ జీవో అమలులో మార్గదర్శకాలను వెల్లడించాలని కోరారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే జి.వినోద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్యను తొలగించాలని కోరారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ప్రభుత్వ పిజి కాలేజి, పాలిటెక్నిక్ , ఐటిఐ కాలేజిలను ఏర్పాటు చేయాలని కోరారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల పట్టణం చుట్టూ బైపాస్ రోడ్లు నిర్మించాలని కోరారు.కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తూ సభలో సభ్యులు మాట్లాడే భాష పట్ల అభ్యంతరం వెలిబుచ్చారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి బదులిస్తూ అటువంటి భాష ఏ మాజీ సిఎం కూడా మాట్లారని తెలంగాణ సమాజం దీన్ని హర్షించదంటూ మాజీ సిఎం కేసిర్‌ను ఉద్దేశించి అన్నారు.

తెలంగాణ అంటే మర్యాదకు మారుపేరు అని అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మ కుంచెం ఖానాపూర్‌ను రెవెన్యూడివిజన్‌గా ప్రకటించాలని కోరారు. ఎమ్మేల్యేలు జాఫర్ హుస్సేన్ బొంతు మాధవరెడ్డి , ఆలేరు ఐలయ్య, మదన్‌మోహన్‌రావు , కోరం కనకయ్య, ప్రేమసాగర్‌రావు తదితరులు జీరోఅవర్‌లో తమ నియోజకవర్గాల సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News