Friday, November 15, 2024

తెలంగాణలో 600 మంది డ్రగ్స్ వాడుతున్నారు: సిపి ఆనంద్

- Advertisement -
- Advertisement -

600 people are using drugs in Telangana

 

హైదరాబాద్: తెలంగాణలో 600 మంది డ్రగ్స్ వాడుతున్నట్టు గుర్తించామని సిపి ఆనంద్ తెలిపారు. మూడు అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేసిన సందర్భంగా ఆనంద్ మీడియాతో మాట్లాడారు.  ఇందులో ఎక్కువ మంది బిటెక్ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నట్టు గుర్తించామని, తల్లిదండ్రులు షాక్ అవుతారని పిల్లల వివరాలు గోప్యంగా ఉంచామన్నారు. మీ ఇంటికొచ్చే కొరియర్స్ తల్లిదండ్రులు ఓపెన్ చేయాలని సూచించారు. అమెజాన్ సంస్థల నుంచి కూడా డ్రగ్స్ ఆర్డర్స్ వస్తున్నాయని తెలియజేశారు.   క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని,  డార్క్ వెబ్సైట్స్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని,  డ్రగ్స్ అమ్మేవాళ్లను, వినియోగదారులను అరెస్ట్ చేశామని వివరించారు. పట్టుకున్న నిందితులందరూ ఉన్నత చదువులు చదివిన వారని, బాగా డబ్బు కలిగి ఉన్నవారు ఎక్కువగా ఉన్నారని,  డార్క్ వెబ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలకు చెక్ పెడుతున్నామని స్పష్టం చేశారు.  డార్క్ వెబ్ లో ఎంటర్ అవుతారని,  అందులో వికర్ మీ యాప్ ద్వారా ఆపరేటింగ్ చేస్తున్నారని,  వీటికి పేమెంట్స్ మొత్తం క్రిప్టో కరెన్సీ ద్వారా  చెల్లింపులు జరుపుతున్నట్టు గుర్తించామన్నారు.

పట్టుకున్న వారి ఐడిలు పెట్టి వీటిని ఆపరేటర్ చేస్తున్నామని,  నరేంద్ర ఆర్యా అనే వ్యక్తి డ్రగ్స్ ముఠా లో ప్రధాన సూత్రదారిగా గుర్తించామని,  ఇప్పటివరకు అతడు 30 లక్షల రూపాయల విలువల డ్రగ్స్ అమ్మకాలు జరిపినట్టు గుర్తించామన్నారు. 450 మంది వినియోగదారులు నరేంద్ర దగ్గర నుంచి కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు. డార్క్ వెబ్ ద్వారా డగ్స్ ను కొరియర్ ద్వారా సరఫరా చేసినట్టు గుర్తించామని, పలు ఐడిలతో వీరు ఆపరేటింగ్ చేస్తున్నారని, ఫర్హాన్ మొహాద్ అన్సారీ అనే మరో వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్టు గుర్తించామన్నారు. ఫర్హాన్ కూడా ఇప్పటివరకు 15 లక్షల వరకు ట్రాన్సక్షన్ చేశాడని,  హైదరాబాద్ లో ఆరుగురిని గుర్తించామని, నిందితుల వద్ద నుంది 9 లక్షల విలువ గల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని,  చారాస్, మమ్డా, ఎల్ఎస్ డి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు.  మొత్తం 8 మందిని పట్టుకున్నామని,  చాలా మందిని గుర్తించామని ఆనంద్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News