Sunday, December 22, 2024

రిజిస్ట్రేషన్లలో ‘గోల్ మాల్’

- Advertisement -
- Advertisement -

ప్లాట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్లలో పాన్, ఆధార్ నెంబర్ల పక్కదారి

2019 సంవత్సరం క్రయ,
విక్రయాల్లో భారీ ఎత్తున
అవకతవకలు ఆదాయ
పన్ను విభాగం పరిశోధనలో
గుర్తింపు కేసు నమోదుకు
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు
లేఖ అమ్మకందారులు,
కొనుగోలుదారులకు
సబ్ రిజిస్ట్రార్ల నోటీసులు
ప్రతి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో
100మంది ఎగవేతదారులు
తొలుత రూ.30లక్షల
పైచిలుకు లావాదేవీలపై
నజర్

హైదరాబాద్ : పాన్‌కార్డు, ఆధార్‌కార్డు నెంబర్‌లను త ప్పుగా నమోదు చేయించి ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్ ప్లాట్లు, ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రయ, విక్రయదారులకు స్టాం పులు, రిజిస్ట్రేషన్ శాఖ నోటీసులు జారీ చే స్తోంది. 2019 సంవత్సరంలో ప్రతి సబ్ రిజిస్ట్ట్రార్ పరిధిలో పాన్‌కార్డు, ఆధార్‌కా ర్డు నెంబర్లను కొందరు తప్పుగా నమోదు చేయించి ఆస్తులను అమ్మడం లేదా కొనుగోళ్లు జరిపారు. రూ.30 లక్షల పైచిలుకు ఆస్తులను అమ్మిన, కొనుగోలు చేసిన వా రిలో చాలామంది ఆదాయపన్నును కట్టకుండా తప్పించుకోవడానికి రిజిస్ట్రేషన్‌ల సమయంలో వాటిని తప్పుగా నమోదు చే యించినట్టుగా ఇన్‌కంట్యాక్స్ అధికారు లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు స్టాం పులు, రిజిస్ట్రేషన్‌ల శాఖకు ఒక లేఖను పంపించారు. పలు సబ్ రిజిస్ట్రార్‌ల పరిధిలో రూ.30 లక్షల పైచిలుకు జరిగిన క్రయ, విక్రయాల్లో భారీగా అవకతవతక లు జరిగాయని ఆ లేఖలో ప్రస్తావించారు. వెంటనే సంబంధిత క్రయ, విక్రయదారులకు నోటీసులు పంపించి వారంరోజుల్లోగా వారి నుంచి సమాధానం తెప్పించాలని, ఒకవేళ వారు స్పందించకపోతే వారి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించాలని ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెం ట్ అధికారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శా ఖ పంపించిన లేఖలో పేర్కొన్నారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో సుమారు 100 వరకు ఎగవేతదారులు ఉన్నట్టుగా ఇన్‌కంట్యాక్స్ అధికారులు గుర్తించారు. ప్రస్తు తం రూ.30 లక్షల పైచిలుకు వ్యవహారం ముగిసిన తరువాత రూ.20 లక్షల పైచిలుకు క్రయ, విక్రయదారుల్లో ఇలాంటి వ్యక్తులు సైతం ఉన్నట్టుగా ఇన్‌కంట్యాక్స్ అధికారులు గుర్తించడంతో పాటు రాను న్న రోజుల్లో వారికి కూడా నోటీసులు పంపే తరువాయి 10లో

అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ విషయంలో డాక్యుమెంట్ రైటర్‌లు ముఖ్యపాత్ర వహించినట్టుగా ఆ శాఖ అధికారులు సైతం గుర్తించారు. 2018 డిసెంబర్ నుంచి స్థిరాస్తి క్రయ, విక్రయాలకు సంబంధించి డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు ఆధార్‌కార్డుతో పాటు పాన్‌కార్డు వివరాలను నమోదు చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ల శాఖ సబ్‌రిజిస్ట్రార్‌లను ఆదేశించింది. దీంతోపాటు యూఐడిఏ, ఇన్‌కంటాక్స్ సర్వర్‌తో రిజిస్ట్రేషన్‌లను శాఖ సర్వర్‌ను 2019లో అనుసంధానం చేసింది. అప్పటి నుంచి ఆధార్, పాన్‌కార్డులను రిజిస్ట్రేషన్‌లకు తప్పనిసరి చేశారు. రూ.50 వేలు దాటిన ప్రతి లావాదేవీలకు కచ్చితంగా పాన్‌కార్డును తీసుకోవడంతో పాటు ఆధార్‌కార్డును గుర్తింపుకార్డుగా సబ్ రిజిస్ట్రార్‌లు పరిగణిస్తున్నారు.

అడ్రస్‌లు, ఫోన్ నెంబర్‌ల ఆధారంగా….

ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్ లేఖకు స్పందించిన సబ్ రిజిస్ట్రార్‌లు తమ పరిధిలో 2019 సంవత్సరంలో జరిగిన క్రయ, విక్రయాలపై ప్రస్తుతం దృష్టి సారించారు. 2019 సంవత్సరానికి సంబంధించిన డేటాను ఇప్పటికే సేకరించిన సబ్ రిజిస్ట్రార్‌లు క్రయ, విక్రయదారులకు నోటీసులు పంపే దిశగా చర్యలు చేపట్టారు. రిజిస్ట్రేషన్ జరిగిన సమయంలో వారి ఇచ్చిన అడ్రస్‌లతో పాటు ఫోన్ నెంబర్‌ల ఆధారంగా వారికి నోటీసులు పంపించాలని నిర్ణయించారు. ఒకవేళ వారు ఇచ్చిన ఫోన్‌నెంబర్, అడ్రస్ తప్పు అయినా వారిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించను న్నారు. ఇలా చాలా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తప్పుడు పాన్, ఆధార్ కార్డు నెంబర్‌లతో రిజిస్ట్రేషన్‌లు జరిగినట్టుగా ఇన్‌కంట్యాక్స్ అధికారులు గుర్తించారు.

రెండింతల జరిమానాతో పాటు జైలు శిక్ష….

అయితే సబ్ రిజిస్ట్రార్‌లు పంపించిన నోటీసులకు క్రయ, విక్రయదారులు స్పందిస్తే వారి నుంచి వివరాలను సేకరించి ఇన్‌కంట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సబ్ రిజిస్ట్రార్‌లు పంపించనున్నారు. క్రయ, విక్రయదారులు ఇచ్చిన వివరాలు తప్పు అని తేలితే మాములు జరిమానా కంటే రెండింతల జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడవచ్చని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఒకవేళ తప్పు జరిగిందని క్రయ, విక్రయదారులు ఒప్పుకుంటే మాములు జరిమానాతో పాటు కేసు లేకుండా మొదటితప్పుగా భావించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

స్టాంపు డ్యూటీని చెల్లించని సంస్థలకు సైతం నోటీసులు

2019లో స్టాంపు డ్యూటీని చెల్లించని సంస్థలకు సైతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇప్పటికే నోటీసులు పంపించారు. ఇదే విషయాన్ని తెలియచేస్తూ ఆర్‌బీఐకు లేఖ రాశారు. ఎగవేతదారుల్లో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలే అధికంగా ఉన్నట్టు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ విషయమై పలు సంస్థలతో అవగాహన సదస్సు నిర్వహించినా వారు స్పందించకపోవడంతో రుణ ఒప్పందాలపై స్టాంప్ డ్యూటీ ఎగవేతపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సీరియస్‌గా స్పందించి స్టాంప్‌డ్యూటీని ఎగవేసిన బ్యాంకులు, ఫైనాన్స్‌తో పాటు మిగతా సంస్థలకు నోటీసులు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News