Tuesday, November 5, 2024

‘డబుల్’ స్పీడ్

- Advertisement -
- Advertisement -

జిహెచ్‌ఎంసి పరిధిలో
ఇండ్ల పంపిణీకి వారంలోగా ప్రణాళికలు

అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశం

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలోని నిరుపేదల కోసం జిహెచ్‌ఎంసి నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి వారంలో ప్రణాళికలను సిద్ధం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. గ్రేటర్ వ్యాప్తంగా రూ. 9,714.59 కోట్ల వ్యయంతో 117 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలపై సంబంధింత అధికారులతో కెటిఆర్ సోమవారం హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, నానక్ రాంగూడ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మా ణం, వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియకు సంబంధించి అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కె టిఆర్ మాట్లాడుతూ నిర్మాణం పూరైన 60 వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీకి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను వారం రోజుల లోపల సిద్ధం చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర హౌసింగ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఈ మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలన్నారు. మార్గదర్శకాలను రూపొందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకొని లబ్ధిదారులు ఎంపిక ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అవసరమైన క్షేత్రస్థాయి గుర్తింపు, పరిశీలన కోసం పెద్ద ఎత్తున బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చేవారం ఈ అంశంపై ఉంటుందని, ఆలోగా తుది మార్గదర్శకాలతో, ఇండ్ల పంపిణీకి సంబంధించి అవసరమైన ఖచ్చితమైన కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ, హౌసింగ్, జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సకల సౌకర్యాలతో 60వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ సిద్ధం

కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలతో కొల్లూరులో ఫేస్ –2లో 117 బ్లాక్‌లలో 15,600తో పాటు ఫేస్- 1లో 2052 ఇళ్లు, ఈదుల నాగులపల్లిలో 1944 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ ప్రాంతంలో సుమారు 20 వేల పైగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూరై పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా పోచారం, సింగపూర్ సిటీ సమీపంలో మరో 6వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయ. వీటితో గ్రేటర్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన 60వేలకు పైగా డబుల్ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయి. దీంతో వీటిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చేతుల మీదగా పంపిణీ చేసేందుకు అధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News