- Advertisement -
జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి
హుజూరాబాద్ నుంచి జమున
బిఎస్‌పి నుంచి ఎనిమిది మంది : సిఇఒ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈనెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 4798 మంది నామినేషన్ల దాఖలు చేయగా వాటిలో 33 జిల్లాల వ్యాప్తంగా వేసిన అభ్యర్థులల్లో 608 మంది అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణకు గురైనట్లు సీఈవో కార్యాలయం ప్రకటించింది.
సోమవారం రిటర్నింగ్ అధికారులు పరిశీలన వాటిలో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్, హూజూరాబాద్ నుంచి ఈటెల రాజేందర్ సతీమణి జమున, బిఎస్పీకి చెందిన 8 మంది అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణ చేసినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -