Monday, January 20, 2025

దేశంలో 31 వేలు దాటిన యాక్టివ్ కేసులు

- Advertisement -
- Advertisement -

దేశంలో కొత్తగా 6155 మందికి కరోనా.. 31 వేలు దాటిన యాక్టివ్ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారిన పడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం. గత ఏడాది సెప్టెంబర్ 16న 6298 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,47,51,259 కి చేరింది. ఇందులో5,30,954 మంది మరణించారు. ప్రస్తుం 31,194 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 11 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 0.07 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, 98.74 శాతం మంది కోలుకున్నారు.

1.19 శాతం మంది మరణించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63 శాతానికి పెరగడం విశేషం. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాలను ( ఎమర్జెన్సీ హాట్ స్పాట్స్) గుర్తించి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. దేశం మొత్తం మీద ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News