Thursday, January 23, 2025

ప్రమాదానికి గురైన అయ్యప్ప భక్తుల బస్సు.. 62మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కేరళ : కేరళలో అయ్యప్ప భక్తుల బస్సు ప్రమాదానికి గురైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 62మంది భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. భక్తులందరు తమిళనాడులోని మయిలాదుతురై జిల్లాకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో బస్సు ప్రమాదవశాత్తు లోయలోకి జారిపడింది. నిలక్కల్ సమీపంలోని ఎలావుంకల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో తొమ్మిది మంది చిన్నారులతో పాటు 64మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 62మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News