Friday, November 22, 2024

ఎపిలో 624 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

624 new covid-19 cases reported in AP

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగింది. ఎపి వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 624 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. చికిత్సపొందుతూ 4 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.ఇక ఇదే సమయంలో 810 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,87,44,941 కు చేరుకున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 14,254కు పెరగగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 7,944 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. ఇక, పాజిటివ్ కేసుల సంఖ్య 20,57,252 కు పెరిగితే.. కోలుకున్నవారి సంఖ్య 20,35,054 కు చేరుకుంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 38,312 శాంపిల్స్ పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News