న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి(ఐఎఎఫ్) చెందిన మూడు విమానాలు 629 మంది భారతీయులతో ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి శనివారం ఉదయం ఇక్కడి హిండన్ ఎయిర్ బేస్ చేరుకున్నాయి. పశ్చిమ ఉక్రెయిన్‌కు పొరుగున ఉన్న రొమేనియా, హంగేరి, స్లోవేకియా, పోలాండ్ నుంచి యుద్ధ కల్లోలిత ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను భారత ప్రభుత్వం గత నెల 24వ తేదీ నుంచి తరలిస్తోంది. ఆపరేషన్ గంగలో భాగంగా 10 విమానాల ద్వారా 2,056 మంది భారతీయులను ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి ఐఎఎఫ్ తరలించడమే గాక 26 టన్నుల సహాయక సామగ్రిని ఆ దేశానికి రవాణా చేసినట్లు ఐఎఎఫ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం హిండన్ ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన ఐఎఎఫ్‌కు చెందిన మూడు సి 17 రవాణా విమానాలు శనివారం ఉదయం తిరిగి వచ్చాయని, ఈ విమానాల ద్వారా 629 మంది భారతీయులు రొమేనియా, స్లోవేకియా, పోలాండ్ నుంచి స్వదేశానికి తిరిగిరాగా 16.5 టన్నుల సహాయక సామగ్రి భారత్ నుంచి ఆయా దేశాలకు వెళ్లిందని ఐఎఎఫ్ తెలిపింది.
ఢిల్లీ చేరుకున్న 629 మంది ఉక్రెయిన్ బాధితులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -