- Advertisement -
హైదరాబాద్: దేశంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. గత 24 గంటల్లో 6298 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ నుంచి 4.39 కోట్ల మంది కోలుకోగా ఒక్కరోజు 5916 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.44 కోట్లకు చేరుకోగా 5,28,273 మంది మృత్యువాతపడ్డారు. గురువారం ఒక్క రోజే 19.61 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోవగా 216.17 కోట్ల డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -