Monday, December 23, 2024

ఈ ముసలాడికి అసలు సిగ్గుందా?

- Advertisement -
- Advertisement -

వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాల ప్రకారం పెళ్లిలు జరుగుతాయి. వివిధ మతాల వారు వివిధ సంప్రదాయలు, సంస్కృతుల ఆధారంగా పెళ్లిలు చేసుకుంటారు. కులాలు, మతాలకు అతీతంగా ప్రేమపెళ్లిలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. యువతి, యువకుడు ప్రేమలో పడి ఇద్దరు అర్థం చేసుకున్న తరువాత ఒక్కటవుతున్న జంటలను చూస్తూనే ఉన్నాం. బాల్య వివాహాలు గురించి ఈ మధ్యకాలంలో పుస్తకాలలో చదవడమే కానీ ఎక్కడ చూడలేదు వినలేదు. లేటు వయసులో ఘాటు ప్రేమలాగా వృద్ధురాలిని వృద్ధుడు పెళ్లి చేసుకున్న సంఘటనలు ఉన్నాయి.

పెళ్లి చేసుకుంటే అమ్మాయి, అబ్బాయికి మధ్య వయసు తేడా నాలుగు నుంచి ఐదేళ్లు ఉంటుంది. అంతే తప్ప 20 నుంచి 30 ఏళ్ల వయసు తేడా ఉండదు. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాలో 63 ఏళ్ల వృద్ధుడు, 12 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు మధ్య వయసు తేడా 51 సంవత్సరాలుగా ఉంది. సదరు బాలికకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ఆ వృద్ధుడితో ఇరువైపుల కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయం చేశారు. ఈ పెళ్లికి ఇరు వైపుల కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున బంధువులు హాజరయ్యారు.

ఏ ఒక్కరు పెళ్లికి అడ్డు చెప్పలేదు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. కాటికి కాలు చాపే వయసులో ముసలోడికి పెళ్లి అవసరమా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ఘనాలో బాల్య వివాహాలు నేరలంగ పరిగణిస్తారని నెటిజన్ కామెంట చేయగా ఆ దేశంలో చాలా తప్పులు జరుగుతాయని, వాటిలో ఇది ఒకటి అని మరొరకరు కామెంట్ చేశారు. ఐటెక్ యుగంలోకి వచ్చాక కూడా ఇలాంటి పెళ్లిలు ఎలా జరుగుతున్నాయని మరో నెటిజన్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News