- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,341 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 57 మరణాలు సంభవించాయి. అదే సమయంలో 8,486 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆంధ్రలో ప్రస్తుతం 67,629 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఎపిలో ఇరవై నాలుగు గంటల్లో 1,07,764 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.
6341 new covid-19 cases reported in AP
- Advertisement -