Monday, January 27, 2025

సంగారెడ్డిలో 635 కిలోల గంజాయి సీజ్

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఉదయం భారీగా గంజాయి పట్టుబడింది. కూరగాయల వాహనంలో కేటుగాళ్లు గంజాయి తరలిస్తున్నారు. వాహనం కింది భాగంలో బాక్స్ ఏర్పాటు చేసి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. నిందితుల వద్ద నుంచి 635 కిలోల ఎండు గంజాయిని గుర్తించామని పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ గంజాయి రూ. 3 కోట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకి తరలిస్తున్న 2 బొలెరో వాహనాలు, నగదు, సెల్ ఫోన్లను సీజ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News