కొత్తగా మరో 6361 కేసులు నమోదు
జిహెచ్‌ఎంసిలో 1225, జిల్లాల్లో 5136 మందికి పాజిటివ్
వైరస్ దాడిలో మరో 51 మంది మృతి
4,69,722 కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ట్రీట్మెంట్ అందించే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 25,587 బెడ్లు (బుధవారం సాయంత్రం 6 గంటల ప్రకారం) ఖాళీగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ రెండు సెక్టర్‌లలో సాధారణ, ఆక్సిజన్, వెంటిలేటర్ కలిపి 52,955 బెడ్లు ఉండగా, 27,385 నిండినట్లు ఆరోగ్యశాఖ డ్యాష్‌బోర్డులో పొందుపరిచింది. వీరిలో సాధారణ బెడ్లపై 5824, ఆక్సిజన్‌పై 13,530, వెంటిలేటర్, సి కాప్ మీద 8031 మంది చికిత్స పొందుతున్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. ప్రజలెవ్వరూ అనవసరంగా ఆందోళనకు గురై బెడ్ల కోసం ఇబ్బందులు పడొద్దని అధికారులు చెబుతున్నారు. మైల్డ్ సింప్టమ్స్ ఉంటే ఆసుపత్రులు వెళ్లొద్దని అలాంటి వారికి ఐసోలేషన్ చికిత్స సరిపోతుందని హెల్త్ ఆఫీసర్లు సూచిస్తున్నారు.
మరో 6361 కేసులు..
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 6361 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 1225 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 82, భద్రాద్రి 98,జగిత్యాల 178, జనగామ 51 ,భూపాలపల్లి 75 ,గద్వాల 87, కామారెడ్డి 107,కరీంనగర్ 248 ,ఖమ్మం 188, ఆసిఫాబాద్ 57, మహబూబ్‌నగర్ 224, మహబూబాబాద్ 107, మంచిర్యాల 148, మెదక్ 78, మేడ్చల్ మల్కాజ్‌గిరి 422, ములుగు 35, నాగర్‌కర్నూల్ 190, నల్గొండ 453, నారాయణపేట్ 34, నిర్మల్ 35, నిజామాబాద్ 164, పెద్దపల్లి 100, సిరిసిల్లా 89, రంగారెడ్డి 423, సంగారెడ్డి 227, సిద్ధిపేట్ 244, సూర్యాపేట్ 239, వికారాబాద్ 148, వనపర్తి 110, వరంగల్ రూరల్ 99, వరంగల్ అర్బన్ లో 234, యాదాద్రిలో మరో 162 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 4,69,722కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 3,89,491కి చేరింది. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు 2527 మంది చనిపోయారు.
2500 దాటిన కరోనా మరణాలు…
రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2527కి పెరిగింది. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర వైరస్ తీవ్రత అతి తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతోనే డెత్ రేట్ 0.53 శాతంగా రికార్డు అయింది. ఇది దేశ సగటు 1.1 కంటే తక్కువ కావడం గమనార్హం. మరోవైపు యాక్టివ్ కేసులు కూడా 77,704కి చేరుకున్నాయి. అయితే వీరిలో 85 శాతం మంది ఐసోలేషన్ సెంటర్లలోనే చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అంతేగాక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు కూడా వేగంగానే కోలుకుంటున్నారని, దీంతోనే రికవరీ రేట్ 82.71 శాతానికి చేరుకుంది. ఇదీ దేశ సగటు కంటే అదనమేనని వైద్యశాఖ ప్రకటించింది. మరో 5 శాతం మంది మాత్రం క్రిటికల్ స్టేజ్‌కు వెళ్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి బెడ్ల వివరాలు(5.5.2021 సాయంత్రం 6 గంటల ప్రకారం)
బెడ్లు మొత్తం నిండినవి ఖాళీ
సాధారణ 21,640 5824 15,816
ఆక్సిజన్ 20,256 13,530 6725
వెంటిలేటర్ 11,059 8031 3046
మొత్తం 52,955 27,385 25,587
6361 New Covid-19 Cases Reported in Telangana