Monday, December 23, 2024

63 మందికి జెఎన్ 1 కోవిడ్..గోవాలోనే అత్యధికం 34

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పటివరకూ 63 మందికి కోవిడ్ సబ్‌వేరియంట్ జెఎన్ 1 వైరస్ సోకింది. ఈ మేరకు కేసులు నమోదు అయినట్లు ఆదివారం నాటి సమాచారం ప్రాతిపదికన సోమవారం అధికారులు తెలిపారు. ఈ జెఎన్ 1 కేసులలో అత్యధికం గోవాలోనే కనుగొన్నారు. అక్కడ ఇప్పటివరకూ 34 జెఎన్ 1 కేసులు వెలుగులోకి వచ్చాయి. తరువాతి క్రమంలో మహారాష్ట్రలో తొమ్మండుగురికి, కర్నాటకలో ఎనమండుగురికి , కేరళలో ఆరుగురికి, తమిళనాడులో నలుగురికి, తెలంగాణలో ఇద్దరికి ఈ కోవిడ్ వచ్చింది.

కోవిడ్ వైరస్ ఉపరకం అయిన జెఎన్ 1 పట్ల శాస్త్రీయ సమాజం పూర్తి స్థాయిలో దృష్టిసారించిందని నీతి ఆయోగ్ ఆరోగ్య విషయాల కమిటీ సభ్యులు డాక్టర్ వికె పాల్ తెలిపారు. ఎక్కడికక్కడ సరైన విధంగా నిఘా, వైరస్ లక్షణాలపై ఆరా వంటివి చేపడుతున్నారు. రాష్ట్రాలన్ని కూడా ఈ వైరస్ పట్ల జాగరూకతతో వ్యవహరిచాలని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఈ వైరస్ ఎటువంటి భారీ స్థాయి ముప్పునకు దారితీయదు. ఈ వైరస్ సోకిన వారు చికిత్సలకు ఆసుపత్రులకు పెద్దగా వెళ్లడం లేదు. అత్యధికం ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News