Wednesday, January 22, 2025

మణిపూర్ హింసాకాండ..

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో జాతి ఘర్షణల హింసాకాండలో మృతి చెందిన వారి మృతదేహాలను ఇప్పుడు మార్చురీల నుంచి అంత్యక్రియలకు తరలిస్తున్నారు. ఇంఫాల్ లోని జెఎన్‌ఐఎంఎస్, ఆర్‌ఐఎంఎస్ ఆస్పత్రుల మార్చురీల్లో కొన్ని నెలలుగా ఉన్న 64 మృతదేహాలను ఆయా బంధువులకు గురువారం అప్పగించారు. కుకీ, మెయితీ వర్గాలకు చెందిన ఈ మృతదేహాల్లో కుకీ వర్గానికి చెందిన 60 మృతదేహాలను , మెయితీకి చెందిన నాలుగు మృతదేహాలను హెలికాప్టర్ల ద్వారా తరలించి వారి బంధువులకు అప్పగించారు. మణిపూర్ హింసాకాండ బాధితులకు పరిహారం, పునరావాసం, మానవతా సాయం కోసం ఏర్పాటైన కమిటీ ఒక నివేదిక రూపొందించింది.

175 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించలేదని, కొన్ని నెలలుగా అనేక మృతదేహాలు మార్చురీల్లో ఉన్నాయని పేర్కొంది. గుర్తించిన 169లో 81 మృతదేహాలు బంధువులు తీసుకెళ్లగా, 88 మృతదేహాలను ఇంకా ఎవరూ తీసుకెళ్లలేదని ఇందులో ఆరింటిని ఎవరూ గుర్తించలేదని నివేదిక పేర్కొంది. దీనిపై గుర్తు తెలియని మృతదేహాలను గౌరవ ప్రదంగా ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సుప్రీం కోర్టు మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 64 మృతదేహాల తరలింపునకు మణిపూర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News