Tuesday, January 21, 2025

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 64 కేజీల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. విచారించేందుకు నిందితులను భవానీ నగర్ పీఎస్ కు తరలించామని తెలిపారు. ఈ ముగ్గురిపై గతంలో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రెష్మీ పెరుమల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News