Sunday, April 13, 2025

మనవరాలి వయస్సున్న బాలికతో అసభ్యప్రవర్తన.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న బచ్చన్ ప్రసాద్ షా (64) ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 64 ఏళ్ల బచ్చన్ ప్రసాద్ విచక్షణ మరిచి తన పక్క ఇంట్లో ఉంటున్న మనవరాలి వయస్సున్న ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కుటుంబ సభ్యల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత అతన్ని మేడ్చల్ మల్కాజ్‌గిరి పోక్సో కోర్టులో హాజరుపర్చారు. ఘటనపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడు బచ్చన్ ప్రసాద్ కు 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5000 జరిమానా విధించింది. వీటితో పాటు బాధిత కుటుంబసభ్యులకు రూ.5లక్షల పరిహారం అందేలా ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News