Monday, December 23, 2024

ఐస్‌మేక్‌కు రూ.65.48 కోట్ల ఆర్డర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : శీతలీకరణ పరికరాల తయారీ సంస్థ ఐస్ మేకర్ రిఫ్రిజిరేషన్ అతిపెద్ద ఆర్డర్ పొందడం ద్వారా గణనీయమైన మైలురాయిని సాధించింది. పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి చెందిన డబ్లుబిఎల్‌డిసిఎల్ (వెస్ట్ బెంగాల్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) నుంచి రూ.65.48 కోట్ల విలువచేసే ఆర్డర్‌ను పొందినట్టు ఐసిమేక్ ప్రకటించింది. ఈ కాంట్రాక్ట్ కింద ఐస్‌మేక్ బెంగాల్‌లో హరింగత వద్ద డైరీ ప్రాజెక్టు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఐస్‌మేక్ సిఎండి చంద్రకాంత్ పటేల్ మాట్లాడుతూ, దేశంలో టాప్ డైరీ పరికరాల, యంత్రాల తయారీ సంస్థగా గుర్తింపు పొందిన కంపెనీ ఈ ఆర్డర్‌ను దక్కించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News