Sunday, December 22, 2024

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో 65.67 శాతం పోలింగ్

- Advertisement -
- Advertisement -

అత్యధికంగా భువనగిరిలో 76.78 శాతం
అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూతులలో జరిగిన ఓటింగ్‌లో 65.67 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఇంటి నుంచి ఓటు వేసిన వారు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్న వారితో కలిపి మొత్తం 66.3 శాతం నమోదైనట్లు సిఇఒ ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 3,32,16,348 మంది ఓటర్లు ఉండగా, 2,20,24,806 మంది(66.3 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.

35,805 పోలింగ్ స్టేషన్లలో 2,18,14,035 మంది ఓటు హక్కును వినియోగించుకోగా, 2,10,771 మంది పోస్టల్ బ్యాలెట్, ఇంటి నుంచి ఓటు వేసినట్లు పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌తో పోల్చితే ఈసారి 3 శాతం అధికంగా పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. అత్యధికంగా భువనగిరి పార్లమెంట్‌లో 76.78 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్‌లో 48.48 శాతం నమోదయ్యిందని అన్నారు. నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 84.25 శౠతం, మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో అత్యల్పంగా 42.76 శౠతం నమోదయ్యిందని తెలిపారు. ఓట్ల సంఖ్యాపరంగా మేడ్చల్ సెగ్మెంట్‌లో 3,85,149 మంది ఓట్లు పోల్ కాగా, అత్యల్పంగా భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1,05,383 ఓట్లు పోల్ అయ్యాయని పేర్కొన్నారు.

ఇవిఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్వం

సార్వత్రిక ఎన్నికల సమరం ముగియడంతో ఎన్నికల సామగ్రిని అధికారులు స్ట్రాంగ్ రూములకు తరలించారు. అభ్యర్థుల భవితవ్యం ఇవిఎంలలో నిక్షిప్తమయ్యింది. రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల మధ్య ఇవిఎంలు, వీవీ ప్యాట్‌లకు సీళ్లు వేసిన అధికారులు మూడంచెలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. జూన్ 4వ తేదీన 34 కేంద్రాలలో ఒట్ల లెక్కింపు జరుగుతుంది. అప్పటి వరకు సిసి కెమెరాల నిఘా నీడలోనే ఉంచనున్నారు.

తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాల వారీగా నమోదైన పోలింగ్ శాతం

అదిలాబాద్ -75.09 శాతం
భువనగిరి -67.87 శాతం
కరీంనగర్ 72.54 శాతం
నిజామాబాద్ 71.92 శాతం
జహీరాబాద్ 74.63 శాతం
మెదక్ 75.09 శాతం
మల్కాజిగిరి 50.78 శాతం
సికింద్రాబాద్ 49.04 శాతం
హైదరాబాద్ 48.48 శాతం
చేవెళ్ల 56.50 శాతం
మహబూబ్‌నగర్ 72.43 శాతం
నాగర్‌కర్నూల్ 69.46 శాతం
నల్గొండ 74.02 శాతం
భువనగిరి 76.78 శాతం
వరంగల్ 71.85 శాతం
మహబూబాబాద్ 71.85 శాతం
ఖమ్మం 76.09 శాతం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News