Tuesday, November 19, 2024

దేశంలోని ఖైదీల్లో 65.90%మంది ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలే

- Advertisement -
- Advertisement -

65.90% of the total prison inmates from SC, ST, OBC categories

 

రాజ్యసభలో ప్రభుత్వం వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలోని జైళ్లలో మొత్తం 4,78,600మంది ఖైదీలు ఉండగా, వారిలో 3,15,409 మంది అంటే 65.90 శాతం మంది ఎస్‌సి, ఎస్‌టి, ఇతర వెనుకబడిన తరగతుల(ఒబిసి) కేటగిరీలకు చెందిన వారున్నారని బుధవారం పార్లమెంటుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. 2019 డిసెంబర్ 31 వరకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) రూపొందించిన గణాంకాల ఆధారంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఈ వివరాలను అందజేశారు. దేశంలోని జైళ్లలో ఉన్న ఖైదీల్లో ఎక్కువ మంది దళితులు, ముస్లింలా? కేటగిరీల వారీగా వారి వివరాలు తెలియజేయాలని, వారికి పునరావాసం కల్పించడానికి, విద్యావంతులను చేయడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఏమిటో తెలియజేయాలని రాస్యసభ సభ్యుడు సయ్యద్ నాసిర్ హుసేన్ కోరారు.

దీనికి కిషన్ రెడ్డి ఇచ్చిన లిఖిత పూర్వక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా జైళ్లలో 4,78,600 మంది ఖైదీలు ఉండగా వీరిలో 3,15,409 మంది (65.90) ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి కేటగిరీలకు చెందిన వారు కాగా, 1,26,393 మంది ‘ఇతర’ గ్రూపునకు చెందిన వారున్నారు. వీరిలో 1,62,800 మంది( 34.01శాతం) ఒబిసి కేటగిరీకి చెందిన వారు కాగా 99,273 మంది (20.74 శాతం) ఎస్‌సి, 53,336 మంది (11.14 శాతం) ఎస్‌టి కేటగిరీకి చెందిన వారున్నారు. మొత్తం ఖైదీల్లో4,58,687 మంది (95.83 శాతం) పురుషులు కాగా 19,013 మంది(4.16) మాత్రమే మహిళలున్నారు. కాగా ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఉన్న ఖైదీల్లో అత్యధికులు ఒబిసి, ఎస్‌సి. ఇతర కేటగిరీలకు చెందిన వారు కాగా, మధ్యప్రదేశ్‌లోని జైళ్లలో అత్యధికులు ఎస్‌టిలకు చెందిన వారున్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News