Sunday, January 19, 2025

మేడిగడ్డ 65 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరంః జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత వరద నీరు రాగా అలాగే అన్నారం బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాణహిత, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 85గేట్లకు గాను 65గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ఎగువ నుండి 5 లక్షల 65వేల క్యూసెక్కుల వరద నీరు చేరుకోగా గేట్లు వత్తి ఐదు లక్షల 65వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు. గతంలో ముప్పుకి గురికాకుండా ఉండేందుకు వచ్చిన నీరు వచ్చినట్టే అధికారులు నీటిని వదులుతున్నారు. అలాగే అన్నారం బ్యారేజ్ వద్ద మానేరు నుండి వరద నీరు చేరుకోగా ఉదయం 15గేట్లు ఎత్తుగా వరద నీరు తక్కువ కావడంతో రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మానేరు నుండి 5వేల 265 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, గేట్ల ద్వారా 900 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతానికి అన్నారం బ్యారేజ్ వద్ద రెండు టిఎంసిల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News