నీముచ్(ఎంపీ): ముస్లిం అన్న అనుమానంతో ఓ వృద్ధుడిని కొట్టి చంపేసిన ఉదంతం మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో వెలుగుచూసింది. దాడికి పాల్పడిన ఆ వ్యక్తి ‘నీ పేరు ముహమ్మదా? నీవు జబ్రా నుంచి వచ్చావా?’ అని అడిగాడు. పిడిగుద్దులు కురిపిస్తూ అతడిని ఆధార్ కార్డు కూడా చూపమన్నాడు. మానసికంగా కుంగిపోయిన ఆ 65 ఏళ్ల వృద్ధుడు తర్వాత దెబ్బలకు చనిపోయాడు. తర్వాత బాధితుడిని భన్వర్‌లాల్ జైన్‌గా గుర్తించారు. కాగా దాడికి పాల్పడిన వ్యక్తిని మాజీ బిజెపి కార్పొరేటర్ భర్తగా గుర్తించారు. ఈ ఉదంతాన్నంతా ఒకరు కెమెరాలో రికార్డు చేశారు. కాగా ఈ ఘటనపై ఐపిసి సెక్షన్ 304, 302 కింద కేసు దాఖలు చేసినట్లు నీముచ్ ఎస్‌హెచ్‌ఓ కె.ఎల్. ధంగి తెలిపారు. ఈ కేసులో నిందితుడిని దినేశ్ కుష్వాగా గుర్తించారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా ఈ ఉదంతాన్ని ఖండించారు.
#MadhyaPradesh | Beaten on suspicion of being Muslim, senior citizen dies pic.twitter.com/iCIRAFOKGQ
— NDTV (@ndtv) May 21, 2022