Monday, January 20, 2025

థియేటర్లో దొరికిన 65 ఏళ్ల నాటి పర్సు! అందులో ఏముందంటే..!

- Advertisement -
- Advertisement -

ప్లాజా థియేటర్ పేరు చెబితే అట్లాంటాలో తెలియని వారు ఉండరు. పేరుకి పాత థియేటరే అయినా కళాఖండాలు అనదగ్గ ఎన్నో  సినిమాలు ఆ థియేటర్లో ఆడాయి. అలాంటి థియేటర్లో కొంత భాగానికి రిపేర్లు చేస్తుండగా, ఓ పర్సు దొరికింది. అది 65 ఏళ్ల క్రితం నాటిది. ఆ పర్సులో ఉన్నవి చూసి థియేటర్ యజమాని ఆశ్చర్యపోయాడు. ఆయన అంతటితో ఆగకుండా ఆ పర్సు యజమానిని వెతికి మరీ పట్టుకుని పర్సును అప్పగించాడు!

భవన నిర్మాణ కార్మికులు థియేటర్లోని మేనేజర్ గదికి సమీపంలో తవ్వుతుండగా ఓ పర్సు దొరికింది. వారు ఆ పర్సును థియేటర్ యజమాని క్రిస్ ఎస్కోబార్ కు అప్పగించారు. ఆయన ఆ పర్సును తెరచి చూస్తే, అందులో ఫ్లోయ్ కల్ బ్రెత్ అనే వ్యక్తి విజిటింగ్ కార్డు ఉంది. దాని ఆధారంగా చిరునామా వెతుక్కుంటూ వెళ్తే, అతని కూతురు కల్ బ్రెత్ ఛాంబర్లీన్ తలుపు తీసింది. ఆమె వయసు 71 ఏళ్లు. ఫ్లోయ్ గురించి అడిగితే, ఆయన తన తండ్రి అనీ, 2005లో ఆయన చనిపోయారనీ చాంబర్లీన్ చెప్పింది. పర్సు పోగొట్టుకున్న సమయానికి ఆమె వయసు ఆరేళ్లు. పర్సులో కొన్ని ఇన్సూరెన్సు కార్డులు, డాక్టర్ అపాయింట్ మెంట్ నోట్ వంటివి ఉన్నాయట. తన తండ్రి పోగొట్టుకున్న పర్సును 65 ఏళ్ల తర్వాత తనకు తెచ్చి ఇచ్చిన థియేటర్ యజమాని క్రిస్ ఎస్కోబార్ కు ఆమె ధన్యవాదాలు చెప్పుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News