Monday, December 23, 2024

బంగ్లాదేశ్ హింసాకాండలో 650 మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: బంగ్లాదేశ్ లో ఇటీవల చెలరేగిన హింసాకాండలో మొత్తం 650 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయంలో ఓ నివేదిక పేర్కొంది. జులై 16 నుంచి ఆగస్టు 4 మధ్య జరిగిన హింసలో 400 మంది , ఈనె 5 6 మధ్య జరిగిన హింసలో 250 మంది ప్రాణాలు కోల్పోయారు.

మృతుల్లో నిరసన కారులతోపాటు పాత్రికేయులు, వివిధ దళాల భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వేలాది మంది గాయపడ్డారు. కర్ఫూ నేపథ్యంలో సమాచారాన్ని సేకరించడానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇంకా మరణాలు ఎక్కువగా ఉండవచ్చని నివేదిక పేర్కొంది. జ్యుడీషియల్ కస్టడీలో హింస, అరెస్టులు, మరణాలకు సంబంధించిన సంఘటనలపై పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని కోరింది. ఐరాస ఈ నివేదికను జెనీవాలో విడుదల చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News