Monday, December 23, 2024

ప్రయాణికులకు కేంద్రం ఎర్రజెండా

- Advertisement -
- Advertisement -

657 trains canceled across the country

దేశవ్యాప్తంగా 657 రైళ్లు రద్దు
గూడ్స్ రైళ్లలో థర్మల్ కేంద్రాలకు బొగ్గు
గంటకు 100 కిమీల వేగంతో పరుగులు
విద్యుత్ అత్యయిక స్థితి నివారణకు చర్యలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఒకేసారి మొత్తం 576 రైళ్ల రాకపోకలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. వీటిలో అనేక రకాల రైలు సర్వీసులు ఉన్నాయి. డైలీ మొయిల్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు ఈ రద్దయిన వాటిలో ఉన్నాయి. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరం అయిన ముడి ఇంధన సరుకు బొగ్గు నిల్వలు అందకపోవడంతో పలు ప్రాంతాలలో కరెంటు ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. దీనితో విద్యుత్ కటకట ఏర్పడి వేసవిలో అత్యధిక కోతలు ఏర్పడ్డాయి. ఈ పరిణామం నుంచి గట్టెక్కేందుకు ఇప్పుడు సాధారణ రైలు మార్గాలలో గూడ్స్ రైళ్ల ద్వారా బొగ్గుకేంద్రాల నుంచి బొగ్గును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ దారిలో ప్రయాణికుల రైళ్ల సందడి లేకుండా చేసేందుకు కేంద్రం హడావిడిగా ఉన్నతాధికారులతో చర్చించి 576 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో పలు ప్రాంతాల నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఇప్పుడు పరిమితంగానే ఉంటాయి. విద్యుత్ అత్యవసర పరిస్థితిని నివారించేందుకు, తక్షణం బొగ్గు నిల్వలు విద్యుత్ కేంద్రాలకు వెళ్లేందుకు ఇంతకంటే వేరే చర్య తీసుకునే పరిస్థితి లేదని కేంద్ర అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి.

ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన బొగ్గు రవాణాకు అవసరం అయిన 533 కోల్ రేక్స్‌ను రంగంలోకి దింపారు. ఇదే క్రమంలో సంఖ్యలోనే అన్ని రకాల రైళ్లు దాదాపు 576 వరకూ రద్దు చేశారు. వీటిని నిరవధికంగా ఇప్పటికైతే రద్దు చేస్తున్నట్లు విద్యుత్ కేంద్రాలకు బొగ్గు పరిస్థితి చక్కదిద్దుకునే వరకూ వీటి నిలిపివేత కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. సిద్ధం చేసిన కోల్ రేక్స్‌లలో ఇప్పటికే 427 రేక్‌లలో బొగ్గును లోడ్ చేశారు. మిగిలినవి రెండు మూడు రోజులలో భర్తీ చేసి థర్మల్ కేంద్రాల గమ్యాలు చేరుకుంటాయి. ఈ క్రమంలో మొత్తం 1.62 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు నిర్ణీత కేంద్రాలకు చేరుతాయి. పలు దేశాల నుంచి ఇప్పుడు సత్వరరీతిలో బొగ్గు నిల్వలను దిగుమతి చేసుకుంటున్నారు. రష్యా నుంచి ఇప్పటి యుద్ధం దశలో బొగ్గు రాక నిలిచింది. దీని ప్రభావం ఇప్పుడు ఇక్కడి విద్యుత్ కేంద్రాలపై పడింది. దిగుమతి చేసుకునే బొగ్గును ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిన చేరవేస్తారని సరుకుల రవాణా సంస్థ వర్గాలు తెలిపాయి.

ఈ సంస్థ డైరెక్టర్ ఎన్ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ బొగ్గు నిల్వల పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందన్నారు. అయితే దిగుమతి చేసుకునే బొగ్గును రేవుల నుంచి వెనువెంటనే నిర్ణీత కేంద్రాలకు తరలించడం జరుగుతుంది. ఇందుకు పలు ఏర్పాట్లు చేశారని తెలిపారు. ప్రయాణికుల రైళ్లను కుదించడంతో ఇక రైలు పట్టాలపై ఈ బొగ్గు నిల్వల గూడ్స్ రైళ్లు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లుతాయని శ్రీనివాస్ చెప్పారు. ఇదంతా ఆటోమోటిక్‌గా జరిగేలా చేస్తారని, రేవుల నుంచి లోడ్ తీసుకుని వెంటనే గూడ్స్ రైళ్లలో చేర్చడం అవి గమ్యస్థానాలకు వెళ్లడం అంతా క్రమపద్ధతిలో సాగుతుందని వివరించారు. ప్రయాణ సమయాన్ని తగ్గిస్తారు. బొగ్గు నిల్వల కొరత ఉన్న ప్రాంతాలకు దీనిని హుటాహుటిన పంపిస్తారని వివరించారు . దేశంలో ఏ ఒక్క థర్మల్ విద్యుత్ కేంద్రం అయినా బొగ్గు కొరతతో బంద్ పడకుండా బొగ్గు చేరేలా చేస్తామని అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News