- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్రం నుంచి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇంతవరకు ఉచితంగా 66.07 కోట్ల టీకా డోసులు అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. అలాగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద ఇంకా ఉపయోగించని 4,49,68,520 డోసులు ఉన్నాయని వివరించింది. ఇవి కాక మరో 85,63,780 డోసులు అందుతాయని పేర్కొంది. సార్వత్రిక కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల నుంచి సేకరించిన టీకాల్లో 75 శాతం సేకరించి ఉచితంగా రాష్ట్రాలకు అందిస్తోందని వెల్లడించింది.
- Advertisement -