- Advertisement -
తారాజ్: కజకిస్తాన్‌లో శుక్రవారం ఉదయం 7 గంటలకు భారీ పేలుడు సంభవించింది. తారాజ్ రాజధాని సమీపంలో ఝంబైల్‌లో ఓ ఆయుధాగారంలో భారీ పేలుళ్లు జరగడంతో 9 మంది మృతి చెందగా 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెస్య్కూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఉగ్రవాదులే ఈ చర్యలు పాల్పడి ఉంటారని ఆ దేశ రక్షణ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. పేలుళ్లు జరిగిన సమీపంలో 400 వరకు ఇండ్లు ఉన్నాయని, వెంటనే 1200 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పోలీసులు వెల్లడించారు. ఆరు సార్లు పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు జరిగిన స్థలం నుంచి 12 కిలో మీటర్ల వరకు ప్రజలను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
- Advertisement -