Wednesday, January 22, 2025

కశ్మీర్‌లో 66శాతం తగ్గిన ఉగ్రవాద చర్యలు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇంతకు ముందటితో పోలిస్తే ఆర్టికల్ ఎత్తివేత తరువాత దాదాపు 66 శాతం వరకూ ఉగ్రవాద చర్యల ఉదంతాలు తగ్గుతూ వచ్చాయని, ఈ క్రమంలో ఈ పరిణామం జమ్మూ కశ్మీర్‌లో వినూత్న శాంతి అధ్యాయానికి దారితీసిందని పేర్కొన్నారు.

66 శాతం వరకూ ఉగ్రవాద చర్యలు తగ్గుముఖం పట్టగా, ఇప్పటి దశలో పౌరుల హత్యల్లో 81 శాతం తగ్గుదల ఉందని వివరించారు. ఓ కార్యక్రమాన్ని ఉద్ధేశించి హోం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఇంతకు ముందటి వరకూ టెర్రరిస్టు హబ్‌గా పేరొందిన జమ్మూ కశ్మీర్ ఇప్పుడు టూరిస్టు హబ్ అవుతోందని, ఈ కీలక పరిణామానికి ప్రతిష్ట అంతా ప్రధాని మోడీ నాయకత్వానికి, ఆయన కార్యదక్షతకు దక్కుతుందని అమిత్ షా తెలిపారు.

ఈ రోజు జరిగిన కార్యక్రమంలో హోం మంత్రి ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వంద ఇ బస్సులకు పచ్చజెండా చూపి ప్రారంభించారు. జెకె అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులకు నియామక పత్రాలు, కారుణ్య నియామకాల పత్రాలు అందించారు. జమ్మూ కశ్మీర్ ఉగ్రవాదపు మరకల నుంచి బయటపడటం గణనీయ పరిణామం అని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News