Monday, December 23, 2024

గ్రూప్ 4 ఉద్యోగులుగా 6603 జెపిఎస్‌లు

- Advertisement -
- Advertisement -
ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో ఉన్న 6603 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రూప్ 4 ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శులు ఉత్తర్వులను విడుదల చేశారు. పంచాయతీ కార్యదర్శులుగా 9555 మంజూరైన పోస్టులలో ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హత సాధించిన 6603 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రూప్ 4 ఉద్యోగులుగా ప్రకటించారు. వీరికి రూ.24,280 – 72,850 స్కేల్‌లో వేతనాలు అందనున్నాయి. మరో 3065 పంచాయతీ కార్యదర్శుల పోస్టు ఖాళీలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News