Sunday, December 22, 2024

భారీగా తగ్గిన కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత 24 గంటల వ్యవధిలో 1,88,087 మందికి పరీక్షించగా, 6,660 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరింది. యాక్టివ్ కేసులు 63, 380 వరకు ఉన్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో 24 మంది ప్రాణాలు కోల్పోగా, మొత్తం మరణాల సంఖ్య 5,31,369 కి చేరింది.

Also Read: స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,11,078 వరకు ఉంది. పాజిటివ్ కేసుల్లో 0.14 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.67 శాతం కాగా, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. అయితే ఇప్పటివరకు 220.66 కోట్ల డోసులు పంపిణీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News