Sunday, January 19, 2025

నాలుగో దశ ఎన్నికల్లో 67.70 శాతం పోలింగ్ నమోదు

- Advertisement -
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 13 మంగళవారం నాలుగో దశ పోలింగ్ జరిగింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 స్థానాలకు జరిగిన నాలుగో దశ ఎన్నికల్లో 67.70 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు నాలుగో దశ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నమోదైన పోలింగ్‌ వివరాలను విడుదల చేసింది.

ఈసీ తెలిపిన వివరాల ప్రకారం ఎపిలో 78.25శాతం, తెలంగాణలో 64.93, ఒడిశాలో 73.97, ఝార్ఖండ్‌లో 65.31, బిహార్‌లో 57.06, మహారాష్ట్రలో 59.64, యూపీలో 58.05, పశ్చిమ బెంగాల్‌లో 78.44, జమ్మూకశ్మీర్‌లో 37.98, శాతం పోలింగ్ నమోదైంది.  కాగా, కొన్ని రాష్ట్రాల్లో నిన్న అర్థ రాత్రి పోలింగ్ జరిగినట్లు తెలిపింది. పోలింగ్‌ సమయంలోపు పోలింగ్‌ కేంద్రాల వద్ద వరసల్లో నిల్చున్న ఓటర్లను పోలింగ్‌కు అనుమతించారు. దీంతో పోలింగ్‌ శాతం పెరిగే అవకాశముందని ఈసీ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News