Monday, December 23, 2024

దేశంలో కొత్త క‌రోనా కేసులు 67,597

- Advertisement -
- Advertisement -

67,597 new corona cases in India

 

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త 67,597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 1188 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. దేశంలో ప్ర‌స్తుతం 2.35 శాతం క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆ శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల మొత్తం సంఖ్య 9,94,891గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,02,874కి చేరుకున్న‌ది. ప్ర‌స్తుతం డెయిలీ పాజిటివిటీ రేటు 5.02 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 1.70 కోట్ల కోవిడ్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News