Thursday, January 23, 2025

రామన్నగూడెం తండాలో అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎర్రబెల్లి..

- Advertisement -
- Advertisement -

జనగామ: జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం రామన్నగూడెం శివారు సర్పంచ్ తండాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంగన్ వాడీ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్ వాడీ వర్కర్లను టీచర్లుగా, ఆయాలను హెల్పర్లుగా గుర్తించి వారి జీతాలను పెంచి దేశంలోనే అత్యధికంగా ఇస్తున్నది తెలంగాణలోనేనని అన్నారు. తెలంగాణ వచ్చాకే వారికి గౌరవంతోపాటు వేతనాలు పెరిగాయన్నారు. గతంలో జీతాలు పెంచమని అడిగితే, గుర్రాలతో తొక్కించిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయని తెలిపారు. అంగన్ వాడీలు ప్రాథమిక చదువు కంటే ముందే, అటు తల్లులకు, ఇటు పిల్లలకు కూడా చదువు, ఆరోగ్య కేంద్రాలుగా కూడా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Errabelli starts Anganwadi centre in Ramannagudem Thanda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News