Saturday, December 21, 2024

కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న 6,841 సిబిఐ కేసులు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ( సిబిఐ) దర్యాప్తు చేసిన 6,841 కేసుల విచారణలు దేశంలోని వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 313 కేసులు20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్( సివిసి) తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదిక పేర్కొంది. 2022 డిసెంబర్ 31 నాటికి మొత్తం కేసుల్లో 2.039 కేసులు పదేళ్లనుంచి 20 ఏళ్ల దాకా పెండింగ్‌లో ఉండగా,2.324 కేసులు అయిదేళ్లకు పైబడినుంచి పదేళ్ల వరకు, 842 కేసులు మూడేళ్లనుంచి అయిదేళ్ల దాకా,1,323 కేసులు మూడేళ్లకన్నా తక్కువ కాలం పెండింగ్‌లో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. ‘దేశంలోని వివిధ కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసుల విచారణ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని కమిషన్ పరిగణనలోకి తీసుకొంది. 2021 డిసెంబర్ 31 నాటికి6,841 కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 313 కేసులు20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి’ అని ఆ నివేదిక తెలిపింది.

ఇవే కాకుండా మొత్తం 12,408 అపీళ్లు, రివిజన్ పిటిషన్‌లు హైకోర్టులు, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 417అపీళ్లు, రివిజన్లు 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని నివేదిక తెలిపింది.అలాంటి అపీళ్లు, రివిజన్లలో 688 అపీళ్లు, రివిజన్లు15 ఏళ్లకు పైగా, 20 ఏళ్లకన్నా తక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి. 2,314అపీళ్లు 10నుంచి 15 ఏళ్ల దాకా, 4,005 అయిదేళ్లనుంచి పదేళ్ల దాకా, 2,8881 రెండేళ్లనుంచి అయిదేళ్ల దాకా పెండింగ్‌లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. మరో వైపు 2022 డిసెంబర్ 31 నాటికి సిబిఐ దర్యాప్తు చేస్తున్న 692 కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిలో 42 కేసులు అయిదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని కూడా ఆ నివేదిక పేర్కొంది. సాధారణంగా సిబిఐ కేసు రిజిస్టర్ చేసిన నాటినుంచి ఏడాదిలో దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది.

వీటిలో 60 కేసులు మూడేళ్లనుంచి అయిదేళ్ల దాకా, 79 కేసులు రెండునుంచి మూడేళ్ల దాకా,138 కేసులు ఏడాదికి పైగా రెండేళ్లకన్నా తక్కువ కాలం,373 కేసులు ఏడాదికన్నా తక్కువ కాలం పెండింగ్‌లో ఉన్నాయని ఇటీవల విడుదల చేసిన ఆ నివేదిక పేర్కొంది. దర్యాప్తు పూర్తి కావడం అంటే, సంబంధిత అథారిటీనుంచి అనుమతి అందిన తర్వాత కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేయడం అని అర్థం. అయితే కొన్ని కేసుల్లో దర్యాప్తు పూర్తి కావడంలో కొన్ని జాప్యాలు జరిగినట్లు కమిషన్ గుర్తించిందని ఆ నివేదిక పేర్కొంది. ఎక్కువ పనిభారం, తగినంత మంది సిబ్బంది లేక పోవడం,లెటర్ ఆఫ్ రొగేటరీలకు స్పందనలు పొందడంలో జాప్యం, సుదూరప్రాంతాల్లో ఉన్న సాక్షులను గుర్తించి విచారించడంలో ఎక్కువ సమయం తీసుకోవడం లాంటివి ఆలస్యానికి కారణాల్లో కొన్ని అని ఆ నివేదిక తెలిపింది.
.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News