- Advertisement -
జమ్మూ కశ్మీరు అసెంబ్లీ ఎన్నికల మూడవ దశ పోలింగ్‌లో 69.69 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, వీరిలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికమని ఎన్నికల కమిషన్ గురువారం తెలిపింది. లోక్‌సభ ఎన్నికలలో 58.58 శాతం పోలింగ్ నమోదు కాగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తమ్మీద 63.88 శాతం పోలింగ్ నమోదైందని ఇసి వెల్లడించింది. అక్టోబర్ 1న 40 స్థానాలకు జరిగిన మూడవ దశ పోలింగ్‌లో పాల్గొన్న పురుష ఓటర్ల శాతం 69.37 కాగా మహిళా ఓటర్లు 70.02 శాతం ఉన్నట్లు ఇసి తెలిపింది. తృతీయ జెండర్ విభాగానికి చెందిన ఓటర్లలో 44 శాతం మంది ఓటు వేశారని ఇసి పేర్కొంది.
- Advertisement -