69మందిని బదిలీ చేసిన సిపి సివి ఆనంద్
పంజాగుట్ట, సైఫాబాద్, బహదురుపుర, బేగంబజార్, నారాయణగూడ, షాలిబండ, మొఘల్‌పుర ఆసిఫ్‌నగర్ ఎస్‌హెచ్‌ఓలు
మనతెలంగాణ, సిటిబ్యూరోః హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఇన్స్‌స్పెక్టర్లు 69మందిని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బదిలీ చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీసులపై వరుసగా ఆరోపణలు వస్తుండడంతో పోలీస్ కమిషనర్ భారీ ఎత్తున ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేశారు. ఇందులో పంజాగుట్ట, సైఫాబాద్, బహదురుపుర, బేగంబజార్, నారాయణగూడ, షాలిబండ, మొఘల్‌పుర ఆసిఫ్‌నగర్ ఎస్‌హెచ్‌ఓలుగా పనిచేస్తున్న వారు ఉన్నారు. ఇటీవల వివాద స్పదంగా మారిన పంజాగుట్ట ఇన్స్‌స్పెక్టర్ బదిలీ చేశారు. నిరంజన్ రెడ్డిని సిసిఎస్‌కు అతడి స్థానంలో సిసిఎస్‌లో పనిచేస్తున్న హరిచంద్రారెడ్డిని నియమించారు. హరిచంద్రారెడ్డి గతంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వర్తించారు. సైదాబాద్ ఎస్‌హెచ్‌ఓ సైదిరెడ్డిని సిసిఎస్‌కు, బహదురుపురా దండు దుర్గాప్రసాద్, బేగంబజార్ మధుమోహన్ రెడ్డిని, షాలిబండ ఎస్‌హెచ్‌ఓ పల్లె శ్రీనివాస్, ఆసిఫ్‌నగర్ రవీందర్, మొఘల్‌పుర రవికుమార్ ఎస్‌హెచ్‌ఓలను ఎస్‌బి సిటీకి, నారాయణగూడ ఎస్‌హెచ్‌ఓ గట్టుమల్లును ఎస్‌ఐబికి బదిలీ చేశారు. రాడిసన్ పబ్బు కేసులో సస్పెన్షన్‌కు గురైన ఇన్స్‌స్పెక్టర్ శివచంద్రను సిటీ ఎస్‌బిలో నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని పలు పోస్ స్టేషన్లకు డిఐలను, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు ఇన్స్‌స్పెక్టర్లను నియమించారు. బదలీ అయిన వారు వెంటనే వారి స్థానాల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.