లక్ష దిగువకు క్రియాశీల కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు తాజాగా 6 వేలకు దిగొచ్చాయి. మృతుల సంఖ్య అదుపులోనే ఉంది. సోమవారం 9 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 6915 మందికి వైరస్ సోకినట్టు తేలింది. కొత్త కేసులు డిసెంబర్ చివరినాటి స్థాయికి చేరాయి. పాజిటివిటీ రేటు ఒకశాతం దిగువకు పడిపోయింది. ఇప్పటివరకు 4.29 కోట్ల మందికి కరోనా సోకింది. గత 24 గంటల వ్యవధిలో 180 మంది మృతి చెందారు. ముందు రోజు ఆ సంఖ్య 120 దిగువన ఉంది. ఇప్పటివరకు 5,14,023 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ అదుపులో ఉండడంతో బాధితుల సంఖ్య లక్ష లోపుకు చేరింది. దాంతో క్రియాశీల కేసుల రేటు 0.22 శాతానికి తగ్గి పోయింది. సోమవారం 16,864 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.23 కోట్లు దాటాయి. రికవరీ రేటు 98.59 శాతానికి పెరిగింది. మరోపక్క 18 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటివరకు 177 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.