వార్షికంగా 21% వృద్ధి, రిజిస్ట్రేషన్ల విలువ రూ.4,247 కోట్లు : నైట్ ఫ్రాంక్ ఇండియా
హైదరాబాద్ : ఈ సంవత్సరం (2024) ఫిబ్రవరిలో 6,938 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ జరగ్గా, ఇది వార్షికంగా 21 శాతం పెరిగింది. వీటి విలువ రూ. 4,247 కోట్లు ఉండగా, 32 నెలల్లో అత్యధికం కాగా, వార్షికంగా 42 శాతం పెరిగింది. ఈమేరకు ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక విడుదల చేసింది. ఈ నిఏదిక ప్రకారం, 2024 ఫిబ్రవరిలో నమోదైన గృహాలలో 1,000 నుంచి- 2,000 చదరపు అడుగుల పరిధిలో 71 శాతం ఉన్నాయి.
2024 ఫిబ్రవరిలో రూ .25 నుంచి రూ.50 లక్షల ధర శ్రేణిలో 45 శాతం ఆస్తులు హైదరాబాద్‌లో నమోదైన ఏకైక అతిపెద్ద కేటగిరీ ప్రాపర్టీగా ఉన్నాయి, రూ .25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఆస్తులు మొత్తం రిజిస్ట్రేషన్లో 14 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువ చేసే ఆస్తుల అమ్మకాల రిజిస్ట్రేషన్ల వాటా 2023 ఫిబ్రవరిలో 10 శాతం ఉండగా, 2024 ఫిబ్రవరిలో 14 శాతానికి పెరిగింది.
హైదరాబాద్ నివాస మార్కెట్‌లో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అనే నాలుగు జిల్లాలు ఉన్నాయి. ప్రాథమిక, ద్వితీయ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లకు సంబంధించిన గృహ విక్రయాలను కవర్ చేస్తుంది. నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ మాట్లాడుతూ, రెసిడెన్షియల్ డిమాండ్ దాని బలమైన వేగాన్ని కొనసాగిస్తుంది, ఫిబ్రవరిలో ప్రీమియం గృహాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ధరలు స్థిరంగా పెరిగాయని అన్నారు.