Sunday, November 17, 2024

ఎపిలో కొత్తగా 6,952 కేసులు..58మంది మృతి

- Advertisement -
- Advertisement -

6952 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఎపిలో గడిచిన 24 గంటల్లో మొత్తం 1,08,616 శ్యాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 6,952మందికి కరోనా వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులిటెన్ లో వెల్లడించింది. కరోనాతో మరో 58మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. తాజాగా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 18,03,074కు చేరుకుంది. ఎపిలో ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి 11,882మంది బాధితులు మరణించారు.ఇక, కరోనా నుంచి 16,99,775మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 91,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

6952 New Corona Cases Reported in AP
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News