Wednesday, January 22, 2025

ఆశ పడ్డ రైతులకు నిరాశే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/జగిత్యాల టౌన్ః జగిత్యాలలో సిఎం కెసిఆర్ సభతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో ప్రోత్సాహం లభిస్తుందని ఆశ పడ్డ రైతులకు నిరాశే మిగిలిందని ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జగిత్యాలపై సిఎం కెసిఆర్ సవతి తల్లి ప్రేమ చూపి ప్రజలను నిరాశ పరిచారు. సిఎం వస్తే వరాల జల్లు కురుస్తుందని ఆశ పడ్డ జిల్లా ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. రైతు సంక్షేమమే తమ ధ్యేయం అని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం వెంటనే మూత పడ్డ చక్కెర ఫ్యాకర్టీలను తెరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తే మూత పడ్డ మూడు చక్కెర ఫ్యాక్టరీలను పునఃప్రారంభించవచ్చన్నారు.

జగిత్యాల జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా వంద కోట్ల నిధులు ప్రకటించాలన్నారు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, కెసిఆర్ పాలనకంటే గతంలోని నిజాం పాలనే కొంత మెరుగుగా ఉండేదన్నారు. జిల్లాకు వచ్చిన సిఎం కెసిఆర్ అప్పట్లో కొండగట్టులో జరిగిన ప్రమాదంలో మరణించిన మృతులకు కనీసం నివాళులర్పించకపోవడం బాధాకరమన్నారు. రాయికల్ మండలంలోని ఒడ్డెలింగాపూర్, అల్లీపూర్ గ్రామాలను మండలాలుగా ప్రకటించాల్సి ఉండగా ఆ ఊసే ఎత్తలేదన్నారు. స్థానికంగా చక్కెర ఫ్యాక్టరీ లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు వంద కిలోమీటర్ల దూరంలోని గాయత్రీ చక్కెర ఫ్యాక్టరీకి తరలించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. చక్కెర కర్మాగారం నిర్వహణకు జగిత్యాల జిల్లాలోని ఫ్యాక్స్‌లతో సమాఖ్య ఏర్పాటు చేసి నిర్వహణ చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జున్ను రాజేందర్, గాజుల రాజేందర్, దుర్గయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News