Friday, November 22, 2024

రేపు యూపి ఆరో దశ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -
బ6th phase of UP elections tomorrow
ఆదిత్యనాథ్ సహా ముఖ్యుల జాతకాలు తేలనున్న దశ

లోక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని 57 స్థానాలకు నేడు(గురువారం) ఆరో దశ ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన అజయ్ కుమార్ లల్లూ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య తదితర ప్రముఖుల జాతకాలు ఈ దశ ఎన్నికల్లో తేలనున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ 403 అసెంబ్లీ సీట్లలో 292 సీట్లకు ఇప్పటికే ఓటింగ్ ముగిసింది. ఇప్పుడు ఎన్నికలు పూర్వాంచల్ ప్రాంతానికి తరలాయి. ఇక్కడ 111 సీట్లున్నాయి. ప్రస్తుతం 10 జిల్లాలో వ్యాపించి ఉన్న 57 సీట్లకు గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. అంబేద్కర్‌నగర్, బలరామ్‌పూర్, సిద్ధార్థ్‌నగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, కుషీనగర్, దేవర, బల్లియా జిల్లాలో ఈ 6వ దశ ఎన్నికలు జరుగనున్నాయి. 57 అసెంబ్లీ స్థానాల్లో 11 రిజర్వ్‌డ్‌కు చెందినవి. ఈ దశ ఎన్నిక బిజెపికి చాలా కీలకమైనది. 2017లో బిజెపి ఇక్కడ 46 స్థానాలు గెలుచుకుంది. కాగా మార్చి 10న తుది దశ పోలింగ్‌లో మిగిలిన 54 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

ఆరో దశ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు ముగుస్తుందని, పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఉత్తర్‌ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి అజయ్ కుమార్ శుక్లా తెలిపారు. ఈ దశ ఎన్నికల్లో 676 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం తొలిసారి గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి పోటీపడుతున్నారు. తమ్‌కుహి రాజ్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లల్లూ, బిజెపి నుంచి సమాజ్‌వాదీ పార్టీలోకి చేరిన మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్‌నగర్ నుంచి పోటీచేస్తున్నారు. ఈ దశ ఎన్నికల్లో మంత్రి పదవినాశించి పోటీచేస్తున్న అనేక మంది జాతకం తేలనున్నది. వారిలో పథర్‌దేవ సీటు నుంచి పోటీచేస్తున్న సూర్య ప్రతాప్ షాహి, ఇట్వా నుంచి పోటీ చేస్తున్న సతీష్ చంద్ర ద్వివేది, బన్సీ నుంచి పోటీచేస్తున్న జై ప్రతాప్ సింగ్, ఖజని నుంచి పోటీచేస్తున్న శ్రీరామ్ చౌహాన్, రుద్రపూర్ నుంచి పోటీ చేస్తున్న జైప్రకాశ్ నిషధ్ ఉన్నారు. బల్లియాలోని బైరియా నుంచి ఎంఎల్‌ఏ పదవికి పోటీకి చేస్తున్న సురేంద్ర సింగ్ ఇటీవల వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(విఐపి)లో చేరారు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో కొత్తగా ప్రవేశించారు. ఆయనకు బిజెపి టిక్కెటును నిరాకరించడంతో ఆయన విఐపిలో చేరారు. ఈ దశ ఎన్నికల్లో 2.14 ఓటర్లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News