Monday, December 23, 2024

సికింద్రాబాద్ లో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం..

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: ఇవాళ సికింద్రాబాద్ లో అదృశ్య మైన చిన్నారి కృతికను సిద్దిపేటలో పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళితే ..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ మహాంకాళి ఫిఎస్ పరిధిలో ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలకి చేరుకొని విచారించగా, సిసి కెమరాలో బాలిక ఓ వ్యక్తితో వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రత్యేక టీమ్ తో బాలిక ఆచూకి కోసం వెతకగా సిద్దిపేటలో కృత్తిక ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాలికను తీసుకెళ్తున్న వ్యక్తిని సిద్దిపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . జెబిఎస్ నుంచి కృతికను బస్సులో సిద్దిపేటకు తీసుకెళ్లినట్లు నిందితుడు పోలీసుల ఎదుట తెలిపాడు. బాలికను తీసుకువచ్చి తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించనున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News